రామప్ప సంపదకు ముప్పు తెచ్చే ఓపెన్‌కాస్ట్ గని ప్రతిపాదన ఉపసంహరించాలి
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
కాకతీయ ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం మరియు చారిత్రక రామప్ప చెరువుకు ముప్పు కలిగించే వెంకటాపూర్ పి.వి. నరసింహారావు ఓపెన్‌కాస్ట్ గని ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖులు డిమాండ్ చేశారు. హనుమకొండలోని ప్రగతినగర్‌లో జరిగిన ఈ సమావేశంలో పర్యావరణం, భూగర్భ జలాలు మరియు వారసత్వ ప్రభావాలపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం చేయాలని నిపుణులు స్పష్టం చేశారు.