FCRA సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు

రిపోర్టర్: సురేష్ స్థలం: India

విదేశీ విరాళాల నియంత్రణ (FCRA) సవరణ బిల్లు-2026ను పరిశీలించేందుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్ నేతృత్వంలోని ఈ 31 మంది సభ్యుల కమిటీలో లోక్ సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఉన్నారు. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విదేశీ నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం.