రాప్తాడు ఘటనపై నటుడు మంచు మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తీకరణ

రిపోర్టర్: శివ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని నటుడు మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తండ్రిగా ఈ దారుణంపై స్పందిస్తున్నానని, బాధితురాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. స్నేహితురాలిని కాపాడిన బాలిక ధైర్యాన్ని ఆయన కొనియాడారు. మహిళల పట్ల గౌరవం ఇళ్ల నుంచే ప్రారంభం కావాలని, హింసకు పాల్పడేవారికి కఠిన శిక్ష పడాలని సామాజిక మాధ్యమ వేదికగా మంచు మనోజ్ స్పష్టం చేశారు.