ఉద్యోగాల్ లో మేధావి మహిళలకు ఎదురుదెబ్బ: పరిశోధనలో వెల్లడైన సంచలన విషయాలు

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

మహిళల మేధస్సు వారి ఉద్యోగ జీవితానికి ప్రతికూలంగా మారుతోందని జర్నల్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీలో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. అధిక మేధా సామర్థ్యం కనబరిచే మహిళలను సహచరులు శత్రువులుగా భావిస్తున్నారని, వారికి తగిన సహాయం అందడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. పురుషులకు ఈ సమస్య ఎదురుకావడం లేదని, కంపెనీ సంస్కృతి మహిళల వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారుతోందని మహిళా ఉద్యోగుల ప్రగతి నివేదిక తేల్చిచెప్పింది.