రామకృష్ణాపురంలో ఘనంగా జరిగిన పోషణ్ మాస ఉత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రేణిగుంట
రేణిగుంట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఆదేశాల మేరకు రేణిగుంట మండలం రామకృష్ణాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాస ఉత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత, పోషకాహారం మరియు సమతుల ఆహారం యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ హేమావతి, కోఆర్డినేటర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు స్థానికులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు.