అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట: వివాదరహిత భూముల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఐడీ అధికారులు తెలిపారు. ఎలాంటి వివాదాలు మరియు న్యాయపరమైన చిక్కులు లేని అగ్రిగోల్డ్ భూమలను విక్రయించి, ఆ ద్వారా సమకూరే నిధులను బాధితులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఐడీ అధికారులు బాధితుల పత్రాలను పరిశీలిస్తూ అర్హుల వివరాలను నిర్ధారించే ప్రక్రియను ముమ్మరం చేశారని సమాచారం.