యువరాజుల వివాదంపై స్పందించిన ప్రిన్సెస్ డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్
రిపోర్టర్: గోపి
స్థలం: World
బ్రిటన్ రాజ కుటుంబంలో ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారి మధ్య నెలకొన్న విభేదాలపై ప్రిన్సెస్ డయానా తమ్ముడు చార్లెస్ స్పెన్సర్ స్పందించారు. తాను ఏ ఒక్కరి వైపు ఉండబోనని, ఇద్దరు యువరాజులు తన సోదరి కుమారులేనని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరూ కలిసిపోవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.