అంతరిక్షంలో అమెరికా ఆయుధాల మోహరింపుపై చైనా తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
అంతరిక్ష కక్ష్యలో అధునాతన ఆయుధాలను మోహరించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించడంతో అంతర్జాతీయంగా కలకలం రేగింది. ఈ పరిణామంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చే చర్యలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అగ్రరాజ్యాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.