తుఫాను ప్రభావంతో బొబ్బిలిలో నీట మునిగిన ప్రభుత్వ కార్యాలయాలు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో తుఫాను ప్రభావం కారణంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలోని వ్యవసాయ, డ్వాక్రా, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ కార్యాలయాలు దిగువ ప్రాంతంలో ఉండటంతో ప్రతి వర్షాకాలం, తుఫాను సమయాలలో జలమయం కావడం పరిపాటిగా మారింది. తక్షణమే స్పందించి నీటిని తొలగించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.