తెలుగు ప్రేక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన మందాడి దర్శకుడు మతిమారన్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
మందాడి సినిమా విజయోత్సవ వేడుకలో నటుడు సుహాస్ పై చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో దర్శకుడు మతిమారన్ పుగళేంది స్పష్టతనిచ్చారు. సుహాస్ పై రంగు గురించి ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలను మాత్రమే తానుద్దేశించి మాట్లాడానని, తెలుగు ప్రజలను లేదా టాలీవుడ్ ను కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమపై, ప్రేక్షకులపై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని, తన మాటలు తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించాలని మతిమారన్ కోరారు.