శ్రీశైలం రహదారిపై ఘోర ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి
రిపోర్టర్: dumarla bhaskar senier journalist
స్థలం: అచ్చంపేట
శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉప్పునుంతల మండలం చెన్నారం గేటు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బిజినపల్లి మండలానికి చెందిన బాధితులు మేస్త్రి పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన క్రూజర్ వాహనం ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.