స్వాతంత్ర్య సమరయోధుని విగ్రహ ఏర్పాటుకు నేతల వినతి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అంబర్‌పేట

అంబర్పేటలో స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముదిరాజ్ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ను కలిసి వారు వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ తొలి మేయర్గా మరియు జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, ప్రధాన కూడళ్లలో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.