అలంపూర్లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: కన్నుల పండువగా తెప్పోత్సవం

రిపోర్టర్: సునీల్ స్థలం: అలంపూర్

అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయని ఆలయ అధికారులు తెలిపారు. విజయదశమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, త్రిశూల స్నానం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. తుంగభద్ర నది హారతి అనంతరం యోగ నరసింహ స్వామి వారి తెప్పోత్సవాన్ని భక్తుల నడుమ కన్నుల పండువగా నిర్వహించినట్లు వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసి ఉత్సవాలను విజయవంతం చేసిన ఈవో దీప్తిని భక్తులు ప్రశంసించారు.