బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బహుదా నది
రిపోర్టర్: విజయ్
స్థలం: ఇచ్ఛాపురం
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం గ్రామీణ ప్రాంతంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు బహుదా నదితో పాటు వాగులు ఉద్ధృతంగా పొంగిపొర్లుతున్నాయి. పద్మపురం గడ్డ వద్ద వరద నీరు గ్రామంలోకి చేరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈనేసు పేట వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.