కల్కి రెండు సినిమాలో దీపికా పాత్రను ఎవరితోనూ భర్తీ చేయమన్న నాగ్ అశ్విన్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
కల్కి రెండు చిత్రంలో దీపిక పదుకోన్ చేసిన సుమతి పాత్రను వేరే నటితో భర్తీ చేయడం లేదని దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. తొలిభాగంలో పరిచయమైన ప్రధాన పాత్రల చుట్టూనే మలిభాగం కూడా నడుస్తుందని ఆయన తెలిపారు. చిత్రంలో కొత్తగా ఎవరూ చేరడం లేదని ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే నిండు గర్భిణిగా ఉన్న సుమతి పాత్ర లేకుండా సీక్వెల్ ఎలా వస్తుందనే అంశంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.