పుత్తూరులో ఉపాధ్యాయుల సన్మానం.. గురువుల సేవలే వెలకట్టలేనివి: ఎమ్మెల్యే భాను ప్రకాష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుత్తూరు
పుత్తూరులో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అక్షరం నేర్పిన ప్రతి గురువు దైవంతో సమానమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, అది ఒక తపస్సు అని పేర్కొంటూ, గురువుల త్యాగాలను గౌరవించుకోవడం మన బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.