రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి
రిపోర్టర్: సతీష్
స్థలం: Moscow
రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు. సోఫ్యినో ప్రాంతంలో ఒక నివాస భవనంపై డ్రోన్ పడటంతో ఈ ప్రాణనష్టం సంభవించింది. అలాగే ఒక చమురు రిఫైనరీ కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ దాడితో మాస్కో విమానాశ్రయాల్లో తాత్కాలికంగా విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.