భారీ వర్షాలకు నీట మునిగిన కొత్తబంద పంట పొలాలు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలం రింతాడ-2 పంచాయతీ కొత్తబంద గ్రామంలో భారీ వర్షాల కారణంగా పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. నిన్న, ఇవాళ కురిసిన వర్షాలకు తమ పంటలు దెబ్బతిన్నాయని స్థానిక రైతు గెమ్మెలి బాలన్న భార్య చిన్నమ్మి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను అధికారులు తక్షణమే ఆదుకోవాలని, పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.