కేంద్ర ఎన్నికల అధికారిని తొలగించండి: బెల్లంపల్లిలో పసులేటి వెంకటేష్ డిమాండ్
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి వెంటనే తొలగించాలని ఎంసీపీఐ(యు) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో తలపెట్టిన ప్రజా ఆందోళనపై ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. రైళ్ల రద్దు, మెట్రో మూసివేతతో నిరుపేదలు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని ఆయన బెల్లంపల్లిలో సూటిగా స్పష్టం చేశారు.