భారీ వర్షాలతో గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: భద్రాచలం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీల వద్ద నీటిమట్టాలు భారీగా చేరుకుంటున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు వారు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని యానాం కలెక్టర్ శివరాజ్ మీనా స్పష్టం చేశారు.