విద్యార్థులకు అలర్ట్: సీబీఎస్ఈ పది, ఇంటర్ ఎల్ఓసీ సవరణలకు గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

పది మరియు పన్నెండో తరగతి ఎల్ఓసీ డేటా సవరణ విండోను సీబీఎస్ఈ బోర్డు అధికారికంగా ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాల్ లో తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ నెల ఏడో తేదీ వరకు అవకాశం కల్పించినట్లు బోర్డు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.