ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మందులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామారావు స్పష్టం చేశారు. ఐడీవోసీలో ఫార్మసిస్టుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుక్కకాటు, పాముకాటు మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. కిశోర బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి, హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను హెచ్చరించారు.