విశాఖలో షాకింగ్ ఘటన: ఏకంగా పన్నెండు గుడ్లు మింగిన నాగుపాము
రిపోర్టర్: రాజేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలోని అగనంపూడి పరిధిలోని శనివాడకాలనీలో కలకలం రేపిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖలోని శనివాడకాలనీకి చెందిన రైతు కె.నరేష్ ఇంటి ఆవరణలో ఉన్న కోళ్లగూట్లోకి ఓ ఆరడుగుల నాగుపాము ప్రవేశించింది. ఆ గూటిలో ఉన్న కోడి అప్పటికే చనిపోగా, అక్కడ ఉన్న కోడి గుడ్లపై పాము కన్ను పడింది. ఆకలితో ఉన్న ఆ నాగుపాము ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు గుడ్లను విడతలవారీగా మింగేసింది. అతిగా తినడంతో ఆ సర్పం కడుపు భారమై కదల్లేని స్థితికి చేరుకుంది.