తాగునీటి ఎద్దడిపై గరివిడి పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయింపు
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండపాలెం పంచాయతీలో గత యాభై రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నిత్యం తాగునీటి సరఫరా లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సమస్యను పట్టించుకోని అధికారుల తీరును నిరసిస్తూ వైకాపా నేతలు, మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదుట బైటాయించి తీవ్ర ఆందోళన చేపట్టారు.