రూ.800 కోట్లతో గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో అదనపు బైపాస్ లైన్ల నిర్మాణం

రిపోర్టర్: విజయ్ స్థలం: గుంతకల్లు

దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.800 కోట్ల అంచనా వ్యయంతో అదనంగా మరో మూడు బైపాస్ లైన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ కొత్త లైన్ల ద్వారా ఇంజిన్లు మార్చాల్సిన అవసరం లేకుండా రైళ్లు నేరుగా వెళ్లే అవకాశం లభించడంతో పాటు ప్రయాణికులకు సమయం, ఇంధనం ఆదా కానుంది.