కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. 1,416 కుటుంబాలకు భూవిముక్తి
రిపోర్టర్: సునీల్
స్థలం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. అమలాపురం, అంబాజీపేట, ముమ్మిడివరం, రామచంద్రాపురం ప్రాంతాల్లో 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న గ్రౌండ్ రెంట్ స్థలాలకు విముక్తి కల్పించారు. ప్రభుత్వ నిర్ణయంతో 1416 కుటుంబాలకు మేలు జరిగింది. అనంతరం గ్రామసభలో పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహించారు.