ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేవారంతా దేశద్రోహులేనంటూ ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియతో చెలగాటమాడేవారంతా దేశద్రోహానికి పాల్పడినట్లేనని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. గాంధీభవన్లో మీడియా కమిటీ ఛైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ వ్యతిరేకుల కుట్రలు బట్టబయలయ్యాయని, త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.