సౌదీ ఆయిల్ పైప్‌లైన్ మూసివేతతో భగ్గుమంటున్న ముడిచమురు ధరలు
రిపోర్టర్: రమేష్
స్థలం: World
హూతీ రెబెల్స్ వైమానిక దాడుల కారణంగా సౌదీ అరేబియా తన కీలకమైన ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌ను మూసివేసింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 107 డాలర్లు దాటింది. ఈ పరిణామం దీర్ఘకాలం కొనసాగితే భారత్‌లో ప్రత్యామ్నాయ సరఫరాల ఖర్చులు పెరిగి ఇంధన ధరల మోత మోగే ప్రమాదం ఉంది.