జన్నారంలో ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్.. ఉద్రిక్తత

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

తమ సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన జన్నారం మండల ఆశా కార్యకర్తలను పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేశారు. వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించడంతో మండల కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షుడు కే. బుచ్చన్న మాట్లాడుతూ, ప్రజాస్వామ్యయుతంగా ధర్నాకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.