దేశంలో వస్తువుల ఎగుమతుల్లో ఏడవ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం వస్తువుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఏడవ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి రూ.1.77 లక్షల కోట్ల విలువైన 841 రకాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో నిలవగా, తెలంగాణ ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికా, చైనా, సింగపూర్ వంటి దేశాలకు రాష్ట్రం నుంచి ప్రధానంగా సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి.