బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ టీజర్ విడుదల: నవంబర్ 27న థియేటర్లలోకి
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం హైందవ టీజర్ విడుదలైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఆకల్ట్ థ్రిల్లర్ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. రంగాపురం గ్రామంలో జరిగే వింత సంఘటనలు, ఆలయ విగ్రహాల మాయం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ 27వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.