అశాస్త్రీయంగా వార్డుల విభజన చేపట్టారంటూ ఆర్డీవోకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల విభజన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా జరిగిందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన స్థానిక ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఒకే వార్డులో నూట యాభై మంది ఓటర్లను ఇష్టానుసారంగా వేరే ప్రాంతాలకు మార్చేశారని, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.