రోడ్లపై మొక్కజొన్నల ఆరబోత: వాహనదారుల తీవ్ర అవస్థలు, అధికారుల మౌనం
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలంలో పంట కోతల అనంతరం రైతులు మొక్కజొన్నలను రోడ్లపైనే ఆరబెడుతున్నారు. ధాన్యం వల్ల ద్విచక్ర వాహనాలు స్కిడ్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలకు మార్గం లేక ట్రాఫిక్ స్తంభిస్తోంది. ప్రమాదాలకు తావులేకుండా రైతులు కళ్ళలోనే ఆరబెట్టాలని, అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై ధాన్యం వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.