అంతర్జాతీయ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్‌లో భారత్ ఘనవిజయం, 9 పతకాలు
రిపోర్టర్: రాము
స్థలం: India
ఇటలీలో జరిగిన 19వ అంతర్జాతీయ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థులు సత్తా చాటారు. 39 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. 17,800 మంది విద్యార్థుల నుంచి ఎంపికైన ప్రతిభావంతులు ఈ ఘనత సాధించారు. విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రతిభను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.