అమెరికాలో షాకింగ్ ఘటన: మరణశిక్ష అమలులో విఫలమైన ప్రాణాంతక ఇంజెక్షన్లు

రిపోర్టర్: రమేష్ స్థలం: అమెరికా

అమెరికాలోని టెన్నెసీలో ఓ హత్య కేసు దోషికి అమలు చేసిన మరణశిక్ష విఫలమైనట్లు అధికారులు తెలిపారు. 1995 నాటి కేసులో క్రిస్టా గెయిల్ పైక్కు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇవ్వగా, ఆమె శ్వాస ఆగకుండా ప్రాణాలతోనే ఉండటంతో ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ అసాధారణ ఘటనపై థర్డ్ పార్టీ సమీక్షకు టెన్నెసీ గవర్నర్ బిల్ లీ ఆదేశించారు. గత 200 ఏళ్లలో ఆ రాష్ట్రంలో మరణశిక్ష పడిన తొలి మహిళ క్రిస్టా కావడం గమనార్హం.