తాపీ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణ తాపీ కార్మిక సంఘం నూతన పూర్తి కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు అధ్యక్ష కార్యదర్శులు సంకరి కృష్ణ, ఎలుగం శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. కోశాధికారిగా చీకటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా జనగామ రామచందర్, సంకరి సతీష్, కార్యనిర్వహక అధ్యక్షులుగా ముత్తె రమేష్, సహాయ కార్యదర్శిగా యంజాల కుమార్, కార్యనిర్వహక కార్యదర్శిగా ఎండి అంకూష్, ప్రచార కార్యదర్శిగా సింగతి తిరుపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.