క్యాన్సర్ రోగులకు భారీ ఊరట: డ్రగ్స్ ధరలు శాతం తగ్గుదల
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
సామాన్య ప్రజలపై క్యాన్సర్ చికిత్స భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో షెడ్యూల్ చేయని క్యాన్సర్ నిరోధక మందులపై ట్రేడ్ మార్జిన్‌ను ముప్పై శాతానికి పరిమితం చేశారు. ఈ కొత్త విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రోగులకు ప్రయోజనం చేకూరనుండగా, ఏటా సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.