ఇచ్ఛాపురం, పలాస పురపాలక ఎన్నికలు: లాడ్జిలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో రాబోయే పురపాలక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇచ్ఛాపురం, పలాస, కాశీబుగ్గ ప్రాంతాలలో శనివారం రాత్రి లాడ్జిలు మరియు హోటళ్లలో సోదాలు నిర్వహించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసులు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, అసాధారణ వ్యక్తుల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఉంచామని అధికారులు స్పష్టం చేశారు.