కానిస్టేబుల్ కుటుంబానికి భీమా చెక్కు అందజేసిన ఎస్పీ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులు పాల్గొనగా, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తక్షణ సాయం అందేలా చూస్తామని, పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.