హైదరాబాద్లో తీవ్ర తాగునీటి సంక్షోభం: ముప్పు ముంచుకొస్తోందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరిక
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు తీవ్రమై తాగునీటి సమస్య ముప్పు పొంచి ఉందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. నగర ప్రజల అవసరాలకు మరో వంద నుంచి రెండు వందల ఎంజీడీల నీరు అదనంగా అవసరమవుతోందని ఆయన తెలిపారు. జలాశయాల్లో నీటి నిల్వలు రానున్న మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని, ప్రతి ఒక్కరూ నీటి వృధాను అరికట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.