విశాఖలో సముద్ర కాలుష్య నివారణ కోసం నిర్మల్ సాగర్ కార్యక్రమం ప్రారంభం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Visakhapatnam

విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్మల్ సాగర్ పైలట్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి. శ్రీనివాస కుమార్, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ ఈ కార్యక్రమంలో పాల్గొని సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడికి శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టనున్నట్లు తెలిపారు.