విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత మరియు వైకాపా నిరసన
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లు, వైకాపా నేతల మధ్య పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ వైకాపా నేతలు ఆరోపిస్తుండగా, తమ సర్టిఫికెట్లు, మెడళ్లు నిజమైనవంటూ టీచర్లు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు వచ్చిన టీచర్లు, బయట బైఠాయించిన వైకాపా శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.