తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం: సీఎం పట్టువస్త్రాల సమర్పణ

రిపోర్టర్: సునీల్ స్థలం: చిత్తూరు జిల్లా

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ ఘట్టంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం హోదాలో 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా తిరుమలను సందర్శించి, ఆధ్యాత్మిక సంప్రదాయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. టీటీడీ పాలకమండలి, అధికారులను అభినందించారు.