ఇరాక్ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తి
రిపోర్టర్: హరి
స్థలం: Baghdad
ఇరాక్ నుంచి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తిగా ముగిసిందని అమెరికా అధికారులు వెల్లడించారు. బాగ్దాద్, వాషింగ్టన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఉత్తర ఇరాక్‌లోని చివరి వైమానిక స్థావరం నుంచి కూడా సైనికులు వెనుదిరిగారు. సెప్టెంబర్ ముప్పై గడువులోగా ఈ ప్రక్రియ పూర్తయినట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇకపై ఇరాక్ భద్రతా వ్యవహారాల్లో ఆ దేశ సైన్యమే ప్రధాన బాధ్యతలు నిర్వహించనుంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను ఎదుర్కొనేందుకు సంకీర్ణ దళాలు పన్నేండేళ్లుగా కార్యకలాపాలు నిర్వహించాయని పెంటగాన్ తెలిపింది.