కేబుల్ టీవీ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కేబుల్ టీవీ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సదస్సు విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేబుల్ టీవీ రంగ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విరత్ అలీ, ఆనం చిన్నన్న తదితరులు పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.