మైసూర్ లో ఆటోరిక్షాలో వచ్చి అభిమానులను పలకరించిన రజినీకాంత్

రిపోర్టర్: సునీల్ స్థలం: మైసూర్

మైసూర్లో జరుగుతున్న ధర్మన్ సినిమా షూటింగ్లో సూపర్స్టార్ రజినీకాంత్ ఆటోరిక్షాలో వచ్చి అభిమానులకు ఆశ్చర్యపరిచారని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సెక్యూరిటీ నడుమ ఆటోలో లొకేషన్కు చేరుకున్న ఆయనను చూసి ఫ్యాన్స్ కేరింతలు కొట్టగా, వారందరికీ ఆయన చేయి ఊపుతూ అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కమల్ హాసన్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.