టైగర్ ష్రాఫ్పై కాల్పుల యత్నం: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అసలు టార్గెట్ అమిర్ ఖాన్

రిపోర్టర్: రాము స్థలం: ముంబయి

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ దాడికి ముందు ఆ ముఠా అసలు లక్ష్యం ప్రముఖ నటుడు అమిర్ ఖాన్ అని జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఆయన కదలికలు సరిగా అంతుచిక్కకపోవడంతో నిందితులు తమ ప్లాన్ మార్చుకుని టైగర్ ష్రాఫ్ను టార్గెట్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు.