సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరుపై అభిజిత్ దీప్కే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాపై నియంత్రణ కోల్పోయిందని, దేశ ప్రజాస్వామ్యానికి సీఈసీ అతిపెద్ద ముప్పుగా మారారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీపై ప్రేమ ఉంటే ఆయన వద్ద అటెండర్ కావాలని, ఎలక్షన్ కమిషనర్ కుర్చీలో కూర్చోవడానికి వీలేదని హితవు పలికారు. ఓటర్ల జాబితా విశ్వసనీయత సన్నగిల్లిందని అభిజిత్ దీప్కే విమర్శించారు.