అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుకు అండగా నిలిచిన సీతారత్నం ట్రస్ట్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీజీఓ జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు అన్నారు. పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ శ్రీనివాసరావుకు రూ.15 వేల చెక్కును అందజేశారు. జర్నలిస్టులు మరియు విద్యార్థులకు ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొంగర వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ పుల్లయ్య, ఏనుగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.