మంచిర్యాల: భంగ్య నాయక్ తండాలో ఘనంగా తీజ్ వేడుకలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా మురగడం గ్రామపంచాయతీ పరిధిలోని భంగ్య నాయక్ తండాలో తీజ్ పండుగ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సంప్రదాయ వేడుకల్లో తండా యువతులు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని సంస్కృతిని చాటిచెప్పారు.

ఈ కార్యక్రమంలో బాదావత్ శేషరావు నాయక్, ప్రకాష్ నాయక్, సుమంత్ నాయక్, సుందర్ సింగ్ నాయక్, సత్యనారాయణ నాయక్, నందు నాయక్ తదితరులు పాల్గొన్నారు. బంజారా సంప్రదాయంలో తీజ్ పండుగకు ఉన్న విశిష్టతను గ్రామ పెద్దలు ఈ సందర్భంగా వివరించారు.